Mahanadu: మహానాడులో జన ప్రభంజనం.. జగన్‌ సర్కార్‌ను సాగనంపాలనే పిలుపుతో..

Mahanadu: మహానాడులో జన ప్రభంజనం.. జగన్‌ సర్కార్‌ను సాగనంపాలనే పిలుపుతో..
Mahanadu: టీడీపీ మహానాడు ఎప్పుడు నిర్వహించినా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.. కానీ, ఈసారి ఒక ప్రత్యేకత ఉంది.

Mahanadu: టీడీపీ మహానాడు ఎప్పుడు నిర్వహించినా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.. కానీ, ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది.. ఈసారి పసుపు పండుగకు ఊహించిన దానికంటే రెండు మూడు రెట్లు జనం తరలివచ్చారు.. నేల ఈనిందా.. ఆకాశం బద్దలైందా.. పక్కనే ఉన్న బంగాళాఖాతం ఉప్పొంగిందా అనేలా పసుపు సైన్యం పోటెత్తింది.. ఎటు చూసినా జనం జనం.. మహానాడు వేదిక ప్రాంగణమంతా పసుపు సైన్యంతో నిండిపోతే.. అది చాలక ఓపెన్‌ ప్లేస్‌లోనూ జన సంద్రం కనిపించింది..

ఈ జన సంద్రాన్ని డ్రోన్‌ కెమెరాలు సైతం చిత్రీకరించలేకపోయాయి. ఏర్పాట్లతో సంబంధం లేదు.. ఆహ్వానాలు అందలేదని ఆగలేదు.. వాహనాలు లేవని వెనకడుగు వేయలేదు.. మన ఇంటి పండుగ అన్నట్లు.. మహానాడుకు వెళ్లడయే ధ్యేయమన్నట్లు.. చుట్టుపక్కల జిల్లాల నుంచి తెలుగు తమ్ముళ్లు తరలివచ్చారు.. మూడేళ్ల తర్వాత నిర్వహించిన పసుపు పండుగకు కార్యకర్తలు వెల్లువెత్తారు.. మహానాడు మొదటి రోజే ఆహ్వానించిన దానికింటే రెండు, మూడు రెట్లు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు..

నిర్దేశించుకుని ఆహ్వానాలు పంపిన ప్రతినిధుల కన్నా పెద్ద సంఖ్యలో పోటెత్తారు.. ఉదయం పది గంటల సమయానికే మహానాడు ప్రాంగణం పసుపు సైన్యంతో కిక్కిరిసిపోయింది.. ప్రతినిధుల నమోదు కేంద్రాలు, అటు భోజనశాలల వద్ద తీవ్ర రద్దీ కనిపించింది.. ఉదయానికే సభా ప్రాంగణమంతా నిండిపోవడంతో అంతకు రెట్టింపు సంఖ్యలో కార్యకర్తలంతా గుంపులు గుంపులుగా బయట ఉండిపోయారు. ఇక రెండో రోజు బహిరంగ సభ కోసం, చంద్రబాబు స్పీచ్‌ కోసం కార్యకర్తలు, టీడీపీ అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు..

అడ్డంకులు దాటుకుని, ఆంక్షల వలయాన్ని ఛేదించుకుని వేలాది వాహలు జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవునా బారులు తీరి కనిపించాయి. ఒంగోలు నగరమంతా జన సందోహంగా మారింది. ఓ దశలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడానికి పోలీసుల వల్ల కాకపోవడంతో టీడీపీ కార్యకర్తలే సమన్వయం చేసుకున్నారు. చివరకు కార్యకర్తలు, టీడీపీ వాలంటీర్ల చొరవతో చాలా వరకు ట్రాఫిక్‌ క్లియర్‌ అయింది.. ఇంత స్థాయిలో ప్రజా ప్రవాహాన్ని చూసిన అధినేతకు సైతం మాటలు రాలేదు..

తన జీవితంలో ఇలాంటి మహానాడును చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబే అన్నారంటే ప్రజాచైతన్యం ఏ స్థాయిలో అర్థమవుతోంది. ఇక ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.. జగన్‌ సర్కార్‌పై యుద్ధానికి సిద్ధం కండంటూ.. యుద్ధంలో టీడీపీ విజయం కళ్లముందు కనబడుతోందన్నట్లుగా పిడికిలి బిగించి యువనేత లోకేష్‌ తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చారు.. నేతలు, అధినేతల ప్రసంగాలు పసుపు సైన్యంలో ఫుల్‌ జోష్‌ను నింపాయి.. మైకు అవసరం లేకుండానే సైన్యం గర్జన దిక్కులు పిక్కటిల్లేలా రాష్ట్రమంతా వినిపించింది.

క్విట్‌ జగన్‌, సేవ్‌ ఏపీ పేరుతో తీర్మానానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు.. ఇక మాటల్లేవ్‌, మాట్లాడుకోవడాల్లేవ్‌ అన్నట్లుగా.. తేల్చుకునేదేదో ఎన్నికల రణ క్షేత్రంలోనే తేల్చుకుందాం అన్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఒంగోలు మహానాడు ద్వారా సుస్పష్టమైంది.. మొత్తంగా మూడేళ్ల విరామం తర్వాత నిర్వహించిన పసుపు పండుగ ఊహించని రీతిలో గ్రాండ్‌ సక్సెస్‌ అయింది.. పార్టీ శ్రేణుల్లో వచ్చే ఎన్నికలకు సరిపడా ఉత్సాహాన్ని నింపింది.. ఇదే ఉత్సాహంతో ఎన్నికలకు కదులుతామని, జగన్‌ సర్కార్‌ను గద్దె దింపి తీరుతామని పసుపు సైన్యం చెప్తోంది.

Tags

Read MoreRead Less
Next Story