Vijayawada Utsav : ‘విజయవాడ ఉత్సవ్’ ను విజయవంతం చేయండి : ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్

విజయవాడలో దసరా ఉత్సవాల సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్ కార్నివల్ 'విజయవాడ ఉత్సవ్' ను విజయవంతం చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పిలుపునిచ్చారు. ఈ మహోత్సవాన్ని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ మరియు శ్రేయాస్ మీడియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ‘విజయవాడ ఉత్సవ్’ సన్నాహక సమావేశాన్ని విజయవాడలో మురళి ఫార్చూన్ హోటల్లో మంగళవారం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేశారు. ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), సహచర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడను దసరా సంబరాలకు దక్షిణ భారత సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు వచ్చేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. విజయవాడ నగరమంతా భక్తి, సంస్కృతి, పర్యాటకం, వినోదాల సంగమంగా మారి, ప్రపంచంలోనే అతిపెద్ద కార్నివల్ జరుపుకోడానికి సన్నద్ధమవుతోందన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com