Manchu Manoj : మంత్రి లోకేశ్‌ను కలిసిన మంచు మనోజ్

నారావారిపల్లెలో హీరో మంచు మనోజ్ మంత్రి లోకేశ్‌ను కలిశారు. మనోజ్ ఇవాళ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోకి వెళ్లాల్సి ఉండగా పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. దీంతో మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారావారిపల్లెకు వెళ్లి లోకేశ్‌తో భేటీ అయ్యారు. వారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. మరోవైపు, ఈ ఉదయం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మోహన్ బాబు యూనివర్శిటీ నుంచి నారావారిపల్లె వరకు మంచు విష్ణు, మంచు మనోజ్ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే మనోజ్ కు సంబంధించిన ఫ్లెక్సీలను నిన్న తొలగించారు. సుమారు వందకు పైగా ఫ్లెక్సీలను తీసేశారు.
మరోవైపు మంచు మనోజ్ కాలేజ్‌లోకి రావొద్దంటూ మోహన్ బాబు ఇప్పటికే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతినిచ్చింది. దీంతో మనోజ్ కాలేజ్ వద్దకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కాలేజ్‌కు ఉన్న నాలుగు గేట్ల వద్దకు మనోజ్ వెళ్లి.. అక్కడి పోలీసులతో మాట్లాడారు. వారి వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని తన ప్రైవేటు సెక్యూరిటీ, కెమెరామెన్‌లతో వీడియో తీయించారు. మనోజ్ పాటు ఆయన భార్య మౌనిక కూడా కాలేజీ వద్దకు వెళ్లారు. అయితే కాలేజ్‌లోకి అనుమతి లేకపోవడంతో అక్కడి నుంచి నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్.. భార్యతో కలిసి మంత్రి లోకేష్‌ను కలిశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com