Andhra Pradesh: జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించిన మావోయిస్టులు..

X
By - Divya Reddy |16 Jan 2022 3:24 PM IST
Andhra Pradesh: ఏపీలో జగన్ ను వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటించింది మావోయిస్టు పార్టీ.
Andhra Pradesh: ఏపీలో జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటించింది మావోయిస్టు పార్టీ. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. నవ రత్నాల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చింది. జాబ్ క్యాలెండర్ విడుదల, సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానన్న హామీలను జగన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ. 2 లక్షల 32 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్, 34 శాతం పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యూలరైజ్ చేయడం సహా జీతాలు 30 వేలకు పెంచాలని తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com