AP: చంద్రబాబును కలిసిన చిరంజీవి
ఏపీ సీఎం చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి తన తరపున 50 లక్షలు, రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. దీంతో చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఎప్పుడూ ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అంతకు ముందు విరాళం చెక్కులు అందించేందుకు సీఎం నివాసానికి వచ్చిన చిరంజీవికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. ఇటీవలి వరదలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. బుడమేరు ఉద్ధృతితో విజయవాడ నగరం ముంపునకు గురైంది. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. వరద బాధితులకు ఆర్థిక సాయం అందిస్తుంది.
రెక్కల గుర్రంపై చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. దసరా పండుగ సందర్భంగా.. ఈ సినిమా టీజర్ విడుదలైంది. చిరంజీవి మాస్ అవతార్, పవర్‌ఫుల్ డైలాగులు, గ్రాండ్ విజువల్స్‌తో ఈ టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్స్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా దసరా కానుకగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఊహించని రేంజ్ విజువల్స్ తో మరో లోకం లోకి తీసుకెళ్లింది ఈ టీజర్. రెక్కల గుర్రం మీద మెగాస్టార్ ఎంట్రీ, ఫైట్స్, గ్రాఫిక్స్ అదుర్స్ అనే చెప్పుకోవాలి. ఇక డైలాగ్స్ అయితే అంచనాలకు రెక్కలు కట్టేశాయి.
ఈ సినిమాలో చిరంజీవి రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని స్పష్టమైంది. ఇక కీరవాణి స్కోర్ ఈ టీజర్ లో మరో హైలైట్. మొత్తంగా చెప్పాలంటే ఈ విశ్వంభర టీజర్ మెగా అభిమానులకు మంచి దసరా కానుక అనే చెప్పుకోవాలి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండు పాటలు, క్లైమాక్స్ షూట్ మిగిలిఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘విశ్వంభర’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతికి విడుదల కానుండడంతో చిరంజీవి తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. గేమ్ ఛేంజర్‌కు మద్దతిచ్చిన మెగాస్టార్ చిరంజీవి, యూవీ క్రియేషన్స్‌కు కూడా ధన్యవాదాలని దిల్ రాజు తెలిపారు. విశ్వంభర టీజర్ శనివారం విడుదలవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com