Heavy Rains : ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. వచ్చే 5రోజులు భారీ వర్షాలు

Heavy Rains : ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. వచ్చే 5రోజులు భారీ వర్షాలు
X

ఏపీలో రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే 5రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఇప్పటికే పలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

Tags

Next Story