Minister Achanna : మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మంత్రి అచ్చన్న కీలక వ్యాఖ్యలు

Minister Achanna : మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మంత్రి అచ్చన్న కీలక వ్యాఖ్యలు
X

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఒక్క జిల్లాకే పరిమితం కాదని రాష్ట్ర మొత్తం ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, కోపరేటివ్ మార్కెటింగ్ శాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. గణపవరం గ్రామంలో సూపరిపాలకు తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి కృషి చెయ్యాలని సూచించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే బడేటి, అప్కాబ్ ఛైర్మన్ గన్ని,నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజాభిమానంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన సందర్బంగా ఈఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు అదేవిధంగా స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు సూపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమం అని మంత్రి అచ్చెన్న అన్నారు. రాష్ట్రం 200 పైచిలుకు అన్నాక్యాంటిన్ లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నామని, అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20వేల రూపాయలు మూడు దఫాలుగా ఇవ్వనున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మహిళలకు గ్యాస్ డబ్బులు ముందుగానే చెల్లించేందుకు చర్యలు తీసుకున్నమన్నారు. ముఖ్యంగా ఆగష్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాకే పరిమితం కాదని మంత్రి లోకేష్ సూచనలు మేరకు రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకున్నామని, అదేవిధంగా ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుంటామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా ఈ సంవత్సరం కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి అచ్చన్న వివరించారు.

Tags

Next Story