AP : రైతు బజార్ లో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ

AP : రైతు బజార్ లో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ
X

విజయవాడ పడమట రైతు బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్థానిక ఆటోనగర్ APIIC కాలనీలోని రైతుబజార్ లో లభ్యమవుతున్న కూరగాయలను తనిఖీ చేశారు. వాటి నాణ్యతను పరిశీలించారు. అక్కడ కూరలు కొనుకున్న వారితో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోర్డు మీద వున్న ధరలకే కూరగాయలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యేకమైన స్టాల్స్ లో ప్రభుత్వం అందిస్తున్న కందిపప్పు, బియ్యం నాణ్యతలను పరిశీలించారు. కందిపప్పును బియ్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వినియోగదారులకు అందుతున్న ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్లి అక్కడ కందిపప్పు, బియ్యం ధరలను అడిగి తెలుసుకున్నారు.

Tags

Next Story