AP : తమ్ముడు నాని అంటూ గంగుల బ్రిజేంద్రారెడ్డిపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్

ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ని తమ్ముడు నాని అంటూ సంబోధిస్తూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. ఆళ్లగడ్డలో అక్కా, బావ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో చెప్పాడన్నారు. మీ ఇంట్లో బంధువులు లేరా మమ్మల్ని అక్క బావ అంటున్నావు తమ్ముడు నాని. ఎక్కడ, ఎవరి దగ్గర టాక్స్ లు వసూలు చేస్తున్నామో ఒక్కటైనా ఆధారం చూపించాలిగా అంటూ మంండిపడ్డారు. పాపం తమ్ముడు నాని ఎప్పుడో ఒకసారి నిద్రలేస్తాడు, ఎప్పుడో ఒకసారి బయటికి వచ్చి హడావిడిగా ఏదో ఒకటి మాట్లాడుతాడని విమర్శించారు. అహోబిలం జుట్టు సవాలుకు పిలిచినప్పుడు ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా హాజరు కాలేదు. టెండర్లు జరగలేదు కావున ఇంతవరకు జుట్టు సవాలే జరగలేదన్నారు. జుట్టు దొంగతనం కేసులో సస్పెండ్ చేసిన వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని రికమెండ్ చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అమ్మగారు పూజారుల మీద ఒత్తిడి పెట్టి ఎన్నిసార్లు చీరలు దొంగతనం చేయలేదని ఆరోపించారు. మీ అమ్మ గారే గుడ్లు, పాలు, అంగన్వాడికి పోయే సరుకులు అన్ని మీరు కాదా తమ్ముడు కొట్టేసింది. అన్ని పక్కన పెట్టి మీరు చేసినా అరాచకాలు ఆధారాలతో సహా బయటకు తీసి కేసులు పెడితే మీ పరిస్థితి ఏంది అని నిలదీశారు. తమ్ముడు నాని నువ్వు ఫోన్ చేసి మీ సర్పంచ్ ను పక్కనపెట్టి నాకు 25 లక్షలు కమిషన్ ఇవ్వమని అడిగినావా లేదా అని ప్రశ్నించారు. అక్కయినా మంచితనంతో వదిలేస్తుందేమో కానీ మీ బావ వదిలిపెట్టడంటూ అఖిల ప్రియ మండిపడ్దారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com