Andhra Pradesh : ప్రసన్నా.. ఇంకోసారి నోరు జారితే .. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫైర్ !

Andhra Pradesh : ప్రసన్నా.. ఇంకోసారి నోరు జారితే .. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫైర్ !
X

రాష్టంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదు అని కూటమి ప్రభుత్వం తనకు అండగా నిలిచిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ప్రసన్న జుగుప్సాకర మాటలను సమర్థిస్తారా అచ్చోసిన ఆంబోతులా ఇలానే ఊరిమీదికి వదిలేస్తారా..? మీ కుటుంబ సభ్యుల గురించి ఇలా ఎవరైనా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అంటూ ఆమె మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రసన్నది మనుషుల భాష కాదు, పశువుల భాష అంటూ ఫైర్ అయ్యారు.. వెనక్కు తగ్గను నేను కరెక్ట్ అంటున్న ప్రసన్నను వైసిపి నేతలు నిస్సిగ్గుగా వెనకేసుకురావడం అవమానకరమన్నారు. తన ఇల్లు తానే పగలగొట్టుకొని షామియానాలు వేసుకొని చేస్తున్న డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు. కోవూరులో ఓటమి అనంతరం ఫ్రెస్టేషన్ లో నోరు పారేసుకున్న మహిళలే తగిన శాస్తి చేస్తారన్నారు. ప్రసన్నకు ప్రసన్న తన అసభ్య పదజాలాన్ని వెనక్కు తీసుకుంటే సరి లేకుంటే కోవూరు మహిళా సమాజం ప్రసన్నను క్షమించదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన సతీమణి నారా భువనేశ్వరి మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ NDA కూటమి ఎంపి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆమె బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని 5, 12 వార్డులలో పర్యటించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇటీవల తనపై అనుచిత వాఖ్యలు చేసిన వైసిపి నేత ప్రసన్న పై నిప్పులు చెరిగారు. తాను అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ప్రసన్న అవాకులు చెవాకులు పేలాడని ఆమె ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తనను ఉద్దేశించి ప్రసన్న మాట్లాడిన జుగుప్సాకర మాటలను అతని తల్లికో.. చెల్లికో.. వినిపించి మహిళలుగా వారు అంగీకరించగలరా అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రశ్నించారు. ప్రసన్న చరిత్ర కోవూరు నియోజకవర్గమంతా తెలుసని ఇల్లు పగల కొట్టుకొని షామియానాలు వేసుకొని నాటకాలు ఆడితే ప్రజలు నమ్మరన్నారు.

Tags

Next Story