MLA Vemireddy Prasanthi Reddy : అమ్మవారి కటాక్షంతోనే ఎమ్మెల్యేగా గెలిచా

కామాక్షితాయి అమ్మవారి కటాక్షంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు- ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యే ఎంపీ పనితీరుపై ఆరా తీశారు. ముందుగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి ఎమ్మెల్యేని ఇంటింటికి పంపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి ముందుకు వెళ్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో గుంటల రోడ్లను పూడ్చే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి అమాలితో సహా 24 గంటల్లో చెల్లించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు తీసుకుని వచ్చి పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. పెన్నా నదిలో చెత్త వేయకుండా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com