మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు..!

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు..!
వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదని ఆరోపించారు. బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రుణాంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారే అవకాశాలు తొందరలోనే ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని స్పష్టంచేశారు. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన రఘురామ.. మరో నీరో చక్రవర్తిని ఎన్నుకున్నామన్న భావన ఏపీ ప్రజల్లో ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story