ప్రధాని మోదీతో ముగిసిన ఎంపీ రఘురామకృష్ణం రాజు భేటీ!

ప్రధాని మోదీతో ముగిసిన ఎంపీ రఘురామకృష్ణం రాజు భేటీ!
అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తిచేయాలని ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు.

అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తిచేయాలని ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు. సుమారు 18 నిమిషాల పాటు ప్రధానితో రఘురామకృష్ణం రాజు భేటీ అయ్యారు. దేవాలయాలపై దాడులు, పాస్టర్ ప్రవీణ్ అంశం ప్రధానికి వివరించానని ఆయన తెలిపారు. ముఖ్యంగా అమరావతి గురించి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని మోదీని కోరినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Tags

Next Story