సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజు

సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజు
ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఓ ఎంపీ 24 గంటలుగా సీఎంతో మాట్లాడేందుకు యత్నిస్తే స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఓ ఎంపీ 24 గంటలుగా సీఎంతో మాట్లాడేందుకు యత్నిస్తే స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న, ఇవాళ కూడా సీఎంఓకు ట్రై చేశానన్నారు. సీఎం పదవి అంటే గొప్ప అనుకుంటున్నారా జగన్‌ అంటూ ప్రశ్నించారు. మీరు అర రాష్ట్రానికీ మాత్రమే సీఎం అని.. పూర్తి రాష్ట్రాలకు సీఎంలు చాలా మంది తెలుసన్నారు రఘురామకృష్ణరాజు.

ఎంపీగా తన నియోజకవర్గంలోకి వెళ్లనివ్వడం లేదన్నారు. వైవీ సుబ్బారెడ్డి, మంత్రి రంగనాథ్‌రాజు తనపై కుట్ర పన్ని అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఏలూరు డీఐజీకి ఫోన్‌ చేసి మరీ తను ఎలా అయినా అరెస్ట్‌ చేయమని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. డీఐజీకి ప్రభుత్వంలో లేని సుబ్బారెడ్డికి ఏమి సంబంధమని ప్రశ్నించారు. మీరు స్పందించి, మీ వారిని కంట్రోల్‌ చేస్తారా? లేక లేక కోర్టును ఆశ్రయించి.. రాష్ట్రంలో లా లెస్‌పై ఫిర్యాదు చేయమంటారా? అని ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు.

Tags

Read MoreRead Less
Next Story