రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్..!

రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్..!
రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు ఎంపీ రఘురామకృష్ణరాజు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు.

ఏపీ సీఎం జగన్ సీబీఐ కేసులో కోర్టుకు హాజరుకావాల్సిందే అని చెప్పారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన 31 కేసులో నిందితుడిగా ఉన్న జగన్ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. జగన్ కోర్టుకు హాజరుకాని పక్షంలో ప్రజలకు న్యాయస్థానం మీద నమ్మకం పోతుందని చెప్పారు. కోర్టు ముందు జగన్ అయినా.. సామాన్య ప్రజలైనా అందరూ సమానమేనని రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు.

రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు ఎంపీ రఘురామకృష్ణరాజు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రాజ్యాంగంలో ఎక్కడా లేని మూడు రాజధానుల ఆలోచనలను జగన్ తీసుకొచ్చారని ఆరోపించారు. మూకుమ్మడిగా రాజీనామా చేసి అమరావతి రెఫరెండంతో మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమా అని రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు.Tags

Read MoreRead Less
Next Story