జగన్ ప్రభుత్వం పైన మరోసారి ఎంపీ రఘురామ విమర్శలు..!

జగన్ ప్రభుత్వం పైన మరోసారి ఎంపీ రఘురామ విమర్శలు..!
జగన్ ప్రభుత్వ విధానాలపై ఢిల్లీలోని రచ్చబండ వేదికగా రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రేపు సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రానుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అటు ఇటుగా పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉందన్నారు. తదుపరి విచారణలో సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో అని తనకు ఉత్కంఠగా ఉందని రఘురామ అన్నారు.

జగన్ ప్రభుత్వ విధానాలపై ఢిల్లీలోని రచ్చబండ వేదికగా రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టుకును ప్రభుత్వం ఎప్పటికి పూర్తి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ లెక్కలన్నీ తప్పుల తడకే అని విమర్శించారు.

గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన సీఎం జగన్.. ఏడాది దాటినా ఎందుకు కంప్లీట్ చేయలేదో చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story