కర్నూల్‌లో భగ్గుమన్న ఫ్యాక్షన్‌ గొడవలు

కర్నూల్‌లో భగ్గుమన్న ఫ్యాక్షన్‌ గొడవలు
X
టీడీపీ నేత సీనియర్‌ నేత దివంగత కప్పట్రాళ్ల అనుచరుడు కోటేష్ పై హత్యాయత్నం

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత సీనియర్‌ నేత దివంగత కప్పట్రాళ్ల అనుచరుడు కోటేష్ పై హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థులు నిద్రిస్తున్న కోటేష్ అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90శాతం గాయలతో కోటేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్షన్ గొడవలకు రాజకీయ రంగు పులుముకోవడంతో అధికార పార్టీ నేతల అండ ఉండడంతో చెలరేగిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story