AP: టీడీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం..!

సాక్ష్యాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే హత్యాయత్నం జరిగిందన్న వార్తలు ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ నేతలు హత్యాయత్నం జరిపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వాగ్వాదానికి దిగి.. ఐరెన్ రాడ్ తో చింతమనేని సహా ఆయన డ్రైవర్, గన్ మెన్ పై వైసీపీ అల్లరి మూకల దాడికి యత్నించాయని.. చింతమనేని సెక్యూరిటీ దగ్గర నుంచి గన్ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే చింతమనేని ప్రభాకర్ వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తతతో పెనుముప్పు తప్పిందని కూటమి నేతలు చెప్తున్నారు. ఈ దాడిలో స్వయంగా దెందులూరు వైసీపీ ఇంచార్జ్ కొటారు అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది పాల్గొన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. అయితే దీనిపై ఇంకా పోలీసులు అధికారికంగా స్పందించలేదు. చింతమనేనిని హత్యాయత్నం వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తీవ్ర కలకలం
సాక్ష్యాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే హత్యాయత్నం జరిగిందన్న వార్తలు ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ నేతలు హత్యాయత్నం జరిపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు అధికారికంగా స్పందించలేదు. చింతమనేనిని హత్యాయత్నం వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
చింతమనేని బూతు పురాణం
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. మాజీ MLA అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌పై బూతు పురాణం అందుకున్నారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'పెళ్లి వేడుకలో కారు అడ్డుగా ఉందని అతడిపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ BC వర్గానికి చెందినవాడనే అహంకారంతో దాడి చేయడానికి ప్రయత్నించారు. చింతమనేని నువ్వు మారవా? ఇంకెప్పుడు సంస్కారం నేర్చుకుంటావు' అని YCP మండిపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com