Nara Bhuvaneshwari: వాళ్లను ఆదుకోవాలి : నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari (tv5news.in)
Nara Bhuvaneshwari: రాజకీయవేత్తగా చంద్రబాబునాయుడు ఎక్కువగా ప్రజల్లో కనిపిస్తే.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎక్కువగా తెరవెనుకే ఉంటారు. చంద్రబాబును ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. దాంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కాని.. ఇతర సందర్భాల్లో కాని ఈ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తారు.
భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాయలసీమలో భారీ వర్షాలకు తోడు వరదల వల్ల జన జీవనం అస్తవ్యస్తమైంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాచోట్ల ముంచెత్తిన వాన, వరదల వల్ల ఆకలిదప్పికలతో అలమటిస్తున్నారు. తల దాచుకునేందుకు గూడు కూడా కరువైంది. ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన నారా భువనేశ్వరి.. వాళ్లను ఆదుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ ను ఆదేశించారు.
నారా భువనేశ్వరి ఆదేశాలతో బాధితులకు శుక్ర, శనివారాల్లో తాగునీరు, పాలు, బ్రెడ్, భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. తిరుపతి ప్రాంతంలో పలు సేవాకార్యక్రమాలను చేపట్టేలా ప్లాన్ చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ పిలుపు ఆదర్శంగా ఈ ట్రస్ట్ 24 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com