Nara Lokesh: నాపై 14 కేసులు పెట్టారు, అసత్య ఆరోపణలు చేశారు: లోకేష్

Nara Lokesh: దళితులపై వైసీపీ నేతల దాడులు పెరిగాయన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్. సొంత పార్టీ కార్యకర్తలను సైతం వైసీపీ నేతలు వదలడం లేదన్నారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్యే ఇందుకు ఉదాహరణ అని అభివర్ణించారు. హత్య జరిగిన 72 గంటల్లో ఎమ్మెల్సీ అనంతబాబు సజ్జల సహా వైసీపీ ముఖ్య నేతలందరిని కలిశారని ఆరోపించారు లోకేష్. ఎమ్మెల్సీకి పోలీసులే భద్రత కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు.
డ్రైవర్ కుటుంబానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2 కోట్ల రూపాయలు, పోలం ఇస్తానని ప్రలోభ పెట్టారని ఆరోపించారు లోకేష్. వైసీపీ సర్కార్ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు లోకేష్. వైఎస్ జగన్ తనను ఏమి చేయలేడన్నారు. తనపై అనేక అసత్య ఆరోపణలు చేసి..చివరకు ఏమి చేయలేక కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పటివరకూ తనపై 14 కేసులు పెట్టారని..మరో 10 కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు.
ఏం తప్పు చేయలేదు కాబట్టే తానూ కోర్టుకు వచ్చానని..జగన్‌లా వాయిదాలు తీసుకోలేదన్నారు.జగన్ దావోస్ పర్యటనపైనా సెటైర్లు వేశారు లోకేష్. జగన్ దావోస్ పర్యటన వైసీపీ పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందంటూ ఎద్దెవా చేశారు. అదానీని కలిసేందుకు దావోస్ దాకా వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎన్నో పరిశ్రమలు ఏపీకి వచ్చాయని...జగన్ ఒక్క పరిశ్రమనైనా ఏపీకి తెచ్చారా చెప్పాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com