LOKESH: కోర్టుకు హాజరైన నారా లోకేశ్
సాక్షిపై పరువు నష్టం కేసులో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోర్టుకు హాజరయ్యారు. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. ‘‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’’ పేరుతో సాక్షి పేపర్‌లో గతంలో వేసిన అసత్య కథనంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈక్రమంలో లోకేశ్ ఆ పత్రికపై పరువు నష్టం దావా వేశారు. వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది.
వారి కోసమే అన్వేషణ
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పాటుపడే వారి కోసం అన్వేషిస్తున్నామని నారా లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రతిభావంతులు, వినూత్న ఆలోచనలు ఉన్న వారికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతిభావంతుల నుంచి సెప్టెంబరు 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో నాడు చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం ఏపీలోనూ వచ్చేలా కృషి చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. మాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని లోకేశ్ వివరించారు. మానవ వనరులు, మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రణాళిక రూపొందించాల్సి ఉందని... కూటమి ప్రభుత్వంతో కలిసి నడవాలని ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుని కోరుతున్నామని తెలిపారు.
చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారందరి పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన నరసింహస్వామి ఆలయ ముఖ ద్వారాన్ని ఆయన ప్రారంభించారు. భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలుంటాయని హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com