LOKESH: అమెరికా టైం స్క్వేర్‌ వద్ద లోకేశ్‌ జన్మదిన వేడుకలు

LOKESH: అమెరికా టైం స్క్వేర్‌ వద్ద లోకేశ్‌ జన్మదిన వేడుకలు
వినూత్న రీతిలో యువ నేతకు శుభాకాంక్షలు.... ఏపీ వ్యాప్తంగా వేడుకలు

తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో ఓ అభిమాని వినూత్న రీతిలో శుభాకాక్షలు తెలిపారు. T.N.S.F అధ్యక్షడు ప్రణవ్ గోపాల్ స్కూబా డైవింగ్ ద్వారా విశాఖ సాగర గర్భంలోకి వెళ్లి నారా లోకేశ్ చిత్ర పటాన్ని ప్రదశించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ పై ఉన్న అభిమానంతో ఈ సాహస ప్రక్రియ చేపట్టినట్లు ప్రణవ్ వివరించారు.


తెలుగుదేశం యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు విదేశాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మన్నవ మోహనకృష్ణ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జై లోకేష్ , జై మన్నవ అంటూ ప్రఖ్యాత ట్రైం స్క్వేర్ వద్ద నినాదాలు చేశారు.


నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుప్పం బైపాస్ కూడలిలోని నారా లోకేష్ కటౌట్ పాలాభిషేకం నిర్వహించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదినం సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. యువగళం నినాదంతో చేపడుతున్న పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు షమీమ్‌ఖాన్‌, సౌదాగర్‌ జానీ, పెమ్మసాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


జమ్మలమడుగు పట్టణంలోని నారాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయన ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి 400 టెంకాయలను కొట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమణారెడ్డి, దేవగుడి యూత్‌ బృందం నాగేశ్వరరెడ్డి, తులసిరెడ్డి, జయచంద్ర, కె.ఖదీర్‌, కిరణ్‌రాయల్‌, సద్దాం, నవనీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story