57 మంది రండి.. నేనొక్కడినే వస్తా: లోకేష్

57 మంది రండి.. నేనొక్కడినే వస్తా: లోకేష్
57 మంది రండి, నేనొక్కడినే వస్తానంటూ 49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు లోకేష్ సవాల్‌ విసిరారు

మిషన్‌ రాయలసీమలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఛాలెంజ్‌ విసిరారు నారా లోకేష్‌.. 57 మంది రండి, నేనొక్కడినే వస్తానంటూ 49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు సవాల్‌ విసిరారు.. రాయలసీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు సిద్ధమా అంటూ ఓపెన్‌ ఛాలెంచ్‌ చేశారు.. నాలుగేళ్లలో జగన్‌, వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు.. ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదని, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదంటూ మండిపడ్డారు.. బద్వేలు క్యాంప్‌ సైట్‌ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగి వైసీపీకి ఛాలెంజ్‌ విసిరారు లోకేష్‌.

టీడీపీ హయాంలో పూర్తిచేసిన ప్రాజెక్టులు, రాయలసీమకు వచ్చిన కంపెనీల జాబితాను ప్రదర్శిస్తూ క్యాంప్‌ సైట్‌ ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. మిషన్‌ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు లోకేష్‌ సెల్ఫీలు దిగారు.. మేం చేసిందేంటో చూపించామని.. మీరు చేసింది ఏంటో చెప్పే దమ్ము ఉందా అంటూ డైరెక్ట్‌గా జగన్‌కే సవాల్‌ విసిరారు.. గతంలో సీమని అభివృద్ది చేసింది తామేనని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని లోకేష్‌ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story