ఒక్క ఛాన్స్‌ అంటూ సీఎం అయిన జగన్‌... ప్రజల్ని మోసం చేస్తున్నారు : లోకేశ్‌

ఒక్క ఛాన్స్‌ అంటూ సీఎం అయిన జగన్‌... ప్రజల్ని మోసం చేస్తున్నారు : లోకేశ్‌
X
జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రజలపై పన్నుల భారం పెరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు.

జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రజలపై పన్నుల భారం పెరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. వీధి లైట్‌ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణలోనూ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్‌... ఒంగోలులో రోడ్ షోలు నిర్వహించారు. సాయంత్రం నాలుగున్నరకు ఒంగోలు చేరుకున్న లోకేశ్‌.. మంగమ్మ కాలేజీ జంక్షన్‌, చంద్రయ్య నగర్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ఒక్క ఛాన్స్‌ అంటూ సీఎం అయిన జగన్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలు కార్పొరేషన్‌లో టీడీపీ గెలిస్తే.. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీటి పన్నును మాఫీ చేస్తామని అన్నారు.

Tags

Next Story