వైసీపీ నేతలు పోటీచేయలేక.. మా అభ్యర్ధులను భయపెడుతున్నారు : నారా లోకేష్

వైసీపీ నేతలు పోటీచేయలేక.. మా అభ్యర్ధులను భయపెడుతున్నారు :  నారా లోకేష్
మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీనేతలు పోటీచేయలేక.. తమ అభ్యర్ధులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్.

మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీనేతలు పోటీచేయలేక.. తమ అభ్యర్ధులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన .. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ తరుపున వాలంటీర్లు ప్రచారం చేయడం ఏంటని లోకేష్ ప్రశ్నించారు. సీఎం జగన్ పన్నులు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు. మచిలీపట్నం రోడ్‌షోలో పాల్గొన్నఆయన .. అధికారపక్ష ఆగడాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 25మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ రెడ్డీ.. ఇప్పుడు కేంద్రం ముందు తానే మెడలు దించుకుటుంటున్నారని ఎద్దేవా చేశారు.

Tags

Next Story