రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిర్బంధంపై లోకేష్ ఆగ్రహం

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిర్బంధంపై లోకేష్ ఆగ్రహం
పిరికి పాలకుడు జగన్‌రెడ్డి అరాచకాలు ఇంకెన్నాళ్లు అంటూ ప్రశ్నించారు లోకేష్‌.

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిర్బంధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో పల్నాడు వెళ్లకుండా ఇంటి గేటుకు తాళ్లుకట్టి అడ్డుకున్నారన్నారు. 2020లో విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాకుండా చుట్టుముట్టారని..ఇప్పుడు 2021లో రేణిగుంట ఎయిర్‌పోర్టులో నిర్బంధించారన్నారు.

పిరికి పాలకుడు జగన్‌రెడ్డి అరాచకాలు ఇంకెన్నాళ్లు అంటూ ప్రశ్నించారు లోకేష్‌. ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు కట్టిన తాళ్లే.. మీ పాలన అంతానికి ఉరితాళ్లవుతాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్షాల హక్కులను హరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి ప్రతి ఘటన.. జగన్‌రెడ్డి పతనానికి నాంది కాబోతోందన్నారు లోకేష్‌.
Tags

Read MoreRead Less
Next Story