పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకివ్వడం లేదు- నారా లోకేశ్

Nara Lokesh: పోలవరం ముంపు బాధితులపై జగన్ సర్కార్ తీరును నిరసిస్తూ..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్..తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనకుగాను ఇవాళ భద్రాచలం, టేకులబోరు, శ్రీరామగిరి, చింతూరులో ముంపు బాధితులను కలిశారు. చింతూరు డివిజన్‌లోని కూనవరం మండలంలోని నిర్వాసితులను పరామర్శించారు నారా లోకేశ్. టేకులబోరులో పోలవరం నిర్వాసిత మహిళలు లోకేశ్‌ని కలిసి తమ సమస్యలను విన్నవించారు. పోలవరం నిర్మాణం వెనుక లక్షా 90 వేల మంది త్యాగం ఉందన్నారు నారా లోకేశ్. రోజులు గడుస్తున్నా పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకివ్వడం లేదని వైసీపీ సర్కార్‌ను ప్రశ్నించారు.
అంతకుముందు నారా లోకేశ్..భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు నారా లోకేశ్‌కు వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఏపీ పరిధి పోలవరం ముంపు మండలాల్లోని ఐదు పంచాయతీల సమస్యపై..తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకుంటే.. రెండు నిమిషాల్లో పరిష్కారమవుతుందన్నారు నారా లోకేశ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com