జగన్‌రెడ్డి ప్రభుత్వం చట్టాలను కాలరాస్తోంది - లోకేష్

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఎ పీవో విదారాలకు కేంద్ర బింధువుగా మారారు. నిన్న ఐటీడీఎ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న గిరిజన, ఆదివాసీ సంఘాలను చర్చలకు పిలిచిన పీవో ప్రవీణ్ ఆదిత్య... కింద కూర్చోబెట్టి అధికార దర్పంతో వ్యవహరించారు. పీవో తీరుపై ఆదివాసీలు మండిపడుతున్నారు. కింద కూర్చున్నవారిలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరీ, తూర్పుగోదారి, విశాఖ జిల్లాల ఆదివాసీ సంఘాల నేతలు ఉన్నారు.
ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రంపచోడవరం ఐటీడీఏ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దారుణమన్నారు. చర్చల పేరుతో పిలిచి.. పోలీసులతో నిర్బంధించి గిరిజన ప్రజా ప్రతినిధులను నేలపై కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించారని... ఇది జగన్ రెడ్డి అధికార దర్పనానికి పరాకాష్ట అన్నారు. గిరిజనులకు రక్షణగా ఉన్న చట్టాలు, జీవో పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని.... లేటరైట్ పేరుతో సాగిస్తున్న మైనింగ్ దందాను జగన్ అండ్ కో తక్షణమే నిలిపివేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఆదివాసీల పట్ల అవమానకరంగా, నిరంకుశంగా వ్యవరిస్తున్న రంపచోడవరం ఐటీడీఏ పీవోపై చర్యలు తీసుకోవాలని, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐటీడీఏ.... గిరిజనుల అభివృద్ధి కోసమా.. లేక అధికారుల పెత్తనం కోసమా అని ప్రశ్నించారు. ఆదివాసీల దినోత్సవం నాడు ఐటీడీఏ కార్యాలయంలో ఆదివాసీ జెండా ఎందుకు ఎగురవేయలేని అడిగిన పాపాపికి కేసులు పెట్టారని మండిపడ్డారు.
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని అవమానించిన ఐటీడీఏ పీవోపై తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాల గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు. పీవో ప్రవీణ్ ఆదిత్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్యేను అవమానించడం, కిందన కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిప్పులు చెరిగారు. గిరిజనులందరికీ క్షమాపణలు చెప్పాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com