టీడీపీ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గోనున్న నారా లోకేశ్‌

టీడీపీ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గోనున్న నారా లోకేశ్‌
నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో వైసీపీ దాడిలో గాయపడ్డ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి దంపతులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత తిరువూరు నియోజకవర్గంలోని గొల్లమందల గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా హత్యకు గురైన టీడీపీ కార్యకర్త సోమయ్య భౌతికకాయానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొంటారు.


Tags

Next Story