ఆంధ్రప్రదేశ్‌ని బిహార్‌లా మార్చేశారు : నారా లోకేష్‌ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ని బిహార్‌లా మార్చేశారు : నారా లోకేష్‌ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ని బీహార్‌లా మార్చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. 'నాడు నేడు' లో భాగంగా.. నాడు పచ్చనిసీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్‌ సీమగా చేశారని మండిపడ్డారు. తూర్పుగోదావరిజిల్లాలో రౌడీ గ్యాంగ్‌ హల్‌చల్‌పై స్పందించిన ఆయన.. ఏపీ సర్కార్‌ తీరుపై ట్విట్టర్‌ ద్వారా ఘాటుగా స్పందించారు.

రాష్ట్రంలో రివర్స్‌ పాలన జరుగుతుందన్నారు. జగన్‌ పెంచిపోషిస్తున్న ఇసుక మాఫియా... గన్‌లతో వచ్చి తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో రెచ్చిపోయిందని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి.. ఇసుకను బంగారం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఇసుకాసురులు ఇప్పుడు గన్‌లు పట్టుకుని ప్రజలపై పడ్డారని.. కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంతకైనా తెగించి ప్రజల ప్రాణాలు తీస్తారని లోకేష్‌ అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story