టీడీపీ దెబ్బకు వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అయింది : నారా లోకేష్
టీడీపీ దెబ్బకు వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కృష్ణా జిల్లాలోని నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. నందిగామలోని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పరామర్శించారు. అనంతరం భారీ ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై... లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టాయి పార్టీ శ్రేణులు...
అలాగే తిరువూరు నియోజకవర్గం రామచంద్రాపురంలో నారా లోకేష్ పర్యటించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ గడ్డి కృష్ణారెడ్డి దంపతులను పరామర్శించారు. అక్కడి నుంచి గొల్లమంద చేరుకుని.. వైసీపీ నేతల దాడిలో మరణించిన సోమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు లోకేష్.
వైసీపీ హయాంలో మహిళలకు, దళితులకు భద్రత లేదన్నారు లోకేష్. ప్రభుత్వ చర్యలు అన్నీ గుర్తుపెట్టుకున్నామని... భవిష్యత్తులో అధికారులు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని లోకేస్ అసహనం వ్యక్తం చేశారు. ఇక సొంత ఊరుపేర్లు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మంత్రులు ఉన్నారని ఆరోపించారు లోకేష్. సలహాదారులు మూడున్నర లక్షల జీతం తీసుకుంటున్నారని మండిపడ్డారు. కార్యకర్తలను బెదిరించి గెలుపొందాలని ప్లాన్ చేశారని.. వారికి త్వరలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని లోకేష్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com