ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ.. కరోనా తీవ్రత నేపథ్యంలో..

Nara Lokesh: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వెంటనే స్కూళ్లకు సెలవులు పొడిగించాలని కోరారు నారా లోకేశ్‌.

Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ.. కరోనా తీవ్రత నేపథ్యంలో..
X

Nara Lokesh: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వెంటనే స్కూళ్లకు సెలవులు పొడిగించాలని కోరారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయని.. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మరో రెండు వారాలు సెలవులు ఇచ్చాయని.. లోకేష్‌ లేఖలో పేర్కొన్నారు.

15ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదని గుర్తుచేసిన లోకేష్‌.. గత 10రోజుల్లో ఏపీలో కేసులు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ కేసులు 500 నుంచి 5వేలకు పెరిగాయని.. ఈ సమయంలో స్కూల్స్‌ నడపడం మంచిది కాదని ఆయన సూచించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని.. వెంటనే సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని.. నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES