Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ.. ఆక్వా హాలిడేపై చర్యలు తీసుకోవాలంటూ..

Nara Lokesh: సీఎం జగన్‌కు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలన్నారు. ఆక్వా హాలీడే ప్రకటించకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. మీరు పదవీప్రమాణ స్వీకారం చేసిన నుంచీ ఒక్కో రంగం సంక్షోభంలో కూరుకుపోవడం చూస్తున్నామన్నారు. యాధృశ్చికమో, మీ ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదు కానీ లక్షలాది మందిపై ప్రభావం తీవ్రంగా పడుతోందన్నారు.
ఇసుక పాలసీ మార్చి భవన నిర్మాణ రంగాన్ని, దానికి అనుబంధంగా వున్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేశారని విమర్శించారు. వందలాది మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారని ఆరోపించారు. అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించేలా చేశారని లేఖలో పేర్కొన్నారు లోకేష్. గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులు పంటలు వేయకుండా క్రాప్ హాలిడే పాటిస్తున్నారన్నారు.
ఒక్కో రంగం కుదేలవుతున్నా మీ ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందన్నారు లోకేష్. ఆక్వా రైతులకు విద్యుత్ రేట్లు తగ్గిస్తానని చెప్పి మళ్లీ పెంచి మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి ఆక్వా రంగానికి అందకపోతే.. కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే పరిశ్రమకు కూడా హాలిడే తప్పకపోవచ్చన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com