ఆంధ్రప్రదేశ్

Nara Lokesh : ధాన్యంపై సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

Nara Lokesh : ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్‌కు లేఖ రాశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. మద్దతు ధరతో ఖరీఫ్‌ ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Nara Lokesh :  ధాన్యంపై సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ
X

Nara Lokesh : ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్‌కు లేఖ రాశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. మద్దతు ధరతో ఖరీఫ్‌ ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజన్న రాజ్యమంటేనే రైతన్న రాజ్యమంటూ ఇచ్చిన భరోసా ఎక్కడా కనిపించడంలేదన్నారు. పొలాల వద్దే మద్దతు ధరతో పంటలను కొంటామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటలను పూర్తిస్థాయిలో కొనకుండాన... రబీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం అన్యాయమన్నారు.

2021-22 ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో 83 లక్షల టన్నులు ధాన్యం దిగుబడి వస్తే... ప్రభుత్వం కేవలం 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని మండిపడ్డారు. ఇంకా కొనుగోలు చేయాల్సిన 42 లక్షల టన్నుల ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్‌ చేశారు. ఇక రబీ ధాన్యాన్ని అయినా పూర్తిస్థాయిలో కొంటున్నారా అంటే... అదీ లేదని దుయ్యబట్టారు. రైతులకు అవగాహన కల్పించాల్సిన రైతు భరోసా కేంద్రాలు... వైసీపీ సేవల్లో తరిస్తున్నాయని నిప్పుల చెరిగారు. రబీ సీజన్‌లోనైనా మొత్తం ధాన్యం కొలుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES