109వ రోజుకు చేరుకున్న లోకేష్‌ పాదయాత్ర

109వ రోజుకు  చేరుకున్న లోకేష్‌ పాదయాత్ర
ఇప్పటి వరకు 13వందల 93 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది నేడు జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర

లోకేష్‌ యువగళం పాదయాత్ర ఇవాల్టితో 109వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 13వందల 93 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2గంటలకు సుద్దపల్లె క్యాంప్ సైట్ లో గండికోట, రాజోలు రిజర్వాయర్ నిర్వాసితులు, రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు లోకేష్‌. సాయంత్రం 4గంటలకు సుద్దపల్లె క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

జంగాలపల్లి వద్ద రైతులతో సమావేశం, జె.కొత్తపల్లి వద్ద ముస్లింలతో భేటీ, ఉప్పలూరు వద్ద స్థానికులతో లోకేష్‌ సమావేశం అయి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఉప్పలూరు నుంచి పాదయాత్రగా నిమ్మలదిన్నె చేరుకుంటారు లోకేష్‌. ఇక్కడితో పాదయాత్రకు 14వందల కిలోమీటర్లు పూర్తి కానుంది. ఈ మేరకు శిలాఫలకం ఆవిష్కరించనున్నారు లోకేష్‌. అనంతరం అక్కడే స్థానికులతో భేటీ అవుతారు. వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం ఎన్.కొత్తపల్లి చేరుకుంటారు. అక్కడ కూడా స్థానికులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచిప పాదయాత్రగా ఎన్.కొత్తపల్లి శివారు విడిది కేంద్రానికి చేరుకుంటారు. దీంతో 109వ రోజు పాదయాత్ర పూర్తి అవుతుంది. రాత్రికి లోకేష్ అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story