వైసీపీ, బీజేపీపై తీవ్రస్థాయిలో నారా లోకేష్‌ విమర్శలు

వైసీపీ, బీజేపీపై తీవ్రస్థాయిలో నారా లోకేష్‌  విమర్శలు
ఇది బాదుడు ప్రభుత్వమంటూ వైసీపీ తీరుపై ధ్వజమెత్తారు.. పార్లమెంటుకు 28 రోబోలను జగన్‌ పంపించారని మండిపడ్డారు.

తిరుపతి నగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్ర అనంతరం రోడ్‌షోలో పాల్గొన్న లోకేష్‌.. వైసీపీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.. ఇది బాదుడు ప్రభుత్వమంటూ వైసీపీ తీరుపై ధ్వజమెత్తారు.. పార్లమెంటుకు 28 రోబోలను జగన్‌ పంపించారని.. వారంతా బీజేపీ చెప్పినట్టు తలూపుతున్నారంటూ మండిపడ్డారు.రాష్ట్రంలో ఉన్నది వైకాపా ప్రభుత్వం కాదని, జేసీబీ ప్రభుత్వంటూ లోకేష్‌ సెటైర్లు వేశారు.. జగన్‌ ప్రభుత్వం ఇచ్చే మద్యం తాగితే ప్రాణాలే పోయే పరిస్థితి వస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story