YCP : కల్తీ నెయ్యిపై దేశవ్యాప్తంగా చర్చ.. వైసిపి కొత్త డ్రామా

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ నెయ్యి కేసు ఇప్పుడు దేశంలో పెద్ద చర్చగా మారింది. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఇచ్చిన రిపోర్టులోనే లడ్డు కోసం వాడింది అసలు నెయ్యే కాదని పూర్తిగా కెమికల్ తో తయారు చేసిందని తేల్చారు. ఇన్ని రోజులు అంతా నెయ్యి కల్తీ జరిగిందని అనుకున్నారు. కానీ మరీ దారుణం ఏంటంటే అసలు నెయ్యి లేకుండానే కెమికల్ లాంటి పదార్థాన్ని తీసుకొచ్చి లడ్డూల్లో కలిపేసి హిందూ భక్తులతో తినిపించారు. డబ్బుల కోసం అత్యంత నీచాతి నీచమైన పని చేసింది వైసిపి. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ దరిద్రమైన పని చేశారు. ఇన్ని రోజులు కూటమి దీని గురించి చెబితే వైసిపి తప్పుడు ప్రచారం అంటూ చెప్పింది. కానీ ఇప్పుడు స్వయంగా సిబిఐనే లడ్డు కల్తీలో నెయ్యి కాకుండా కెమికల్ వాడారు అని చెప్పడంతో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయింది. హిందూ భక్తులు మొత్తం వైసీపీని ఛీ కొడుతున్నారు. దీంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుండటం గమనించిన వైసిపి.. కొత్త డ్రామాలకు తెరతీసింది.
ఇందులో భాగంగానే నిన్న మెడికల్ కాలేజీల విషయంలో పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లమీద ధర్నాలు చేసింది. సడన్ గా మళ్లీ వాళ్లకు ఈ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందో అని అంతా అనుకుంటున్నారు. మనకు తెలిసిందే కదా ఏదైనా తమ మీదకు వస్తుందంటే డైవర్ట్ చేయడంలో వైసిపి తర్వాతే ఎవరైనా అని. అలా ప్రజల మైండ్ ను మీడియా ఛానళ్ల కవరేజ్ ను లడ్డు కల్తీ నెయ్యి కేసు నుంచి మెడికల్ కాలేజీ ల మీదకు మళ్ళించడానికి వైసిపి ఆడిన డ్రామా ఇది. వాస్తవానికి పిపిపి విధానాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఈ విధానంలో మెడికల్ కాలేజీలు బాగుపడతాయని అంతా అనుకుంటున్నారు. కానీ కూటమిపై బురద జల్లడం మాత్రమే వైసిపికి ఉన్న పని కదా. పైగా ఇప్పుడు లడ్డు కల్తీ నెయ్యి కేసు వైసిపి మెడకు చుట్టుకుంటుంది. వైసిపి పెద్ద నాయకులకు ఈ కల్తీ నెయ్యి కేసు పెద్ద తలనొప్పిగా మారింది.
దీంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏం చేయాలో అర్థం కాక.. సడన్ గా మెడికల్ కాలేజీల విషయం వాళ్లకు గుర్తుకు వచ్చింది. ఏదో ఒకటి చేసేయాలని ఆత్రంతో రోడ్లమీదకు వచ్చారు వైసీపీ నేతలు. ఒకవేళ తిరుమల తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ కాకపోతే దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు. అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక మీడియా ముందుకు రావట్లేదు. కల్తీ నెయ్యి కేసు ఎక్కువగా హైలెట్ కావద్దని ఉద్దేశంతో వైసిపి ఇలాంటి డ్రామాలకు తెరతీస్తోంది. వై వి సుబ్బారెడ్డిని మరికొన్ని గంటల్లోనే సిబిఐ విచారించబోతోంది. కుదిరితే ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ కేసులో ఆ హైకమాండ్ ఎవరు అనేది త్వరలోనే తేలబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

