AP: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడడం నిజమే

వైసీపీ పాలనలో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీని గాలికొదిలేశారు. లడ్డూలో జంతువుల నెయ్యి ఉపయోగించారనే కఠోర వాస్తవం తెలిసింది. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు జూలై 8వ తేదీన ఎన్డీడీబీ కాప్ ల్యాబ్‌కు పంపించారు. ఎన్డీడీబీ కాప్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలించింది. దీనికి ISO 17025 గుర్తింపు పొందింది. డెయిరీ ఉత్పత్తులను పరిశీలించడంలో మంచి అనుభవం ఉంది. ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ కంపెనీలు నెయ్యి, ఇతర పదార్థాలను నిర్ధారించేందుకు తమ ఉత్పత్తులను పంపిస్తుంటాయి. సంస్థ అందజేసే నివేదికల ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్నాయి. టీటీడీ ఉపయోగించిన నెయ్యిని పరిశీలించి ఆ నెల 16వ తేదీన నివేదిక అందజేశారు. డెయిరీ ఉత్పత్తులను పరిశీలించడంలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ కంపెనీలు నెయ్యి, ఇతర పదార్థాలను నిర్ధారించేందుకు తమ ఉత్పత్తులను పంపిస్తుంటాయి. సంస్థ అందజేసే నివేదికల ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్నాయి. టీటీడీ ఉపయోగించిన నెయ్యిని పరిశీలించి ఆ నెల 16వ తేదీన నివేదిక అందజేశారు.
చంద్రబాబు ఆగ్రహం
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని.. తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందే అని చంద్రబాబు అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతిని చాలా మంది మథనపడ్డారని సీఎం తెలిపారు. తిరుమలలో ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభించామని.. చాలా వరకు పరిస్థితులు మెరుగు పడ్డాయన్నారు.
ఆ రిపోర్టుతో దేశంలో కలకలం
గురువారం నాడు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థ రిపోర్టు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కోసం వినియోగిస్తున్న నెయ్యిలో అడల్ట్రేషన్ జరుగుతోందని.. అందులో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నాయని రిపోర్టు బహిర్గతం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ సంఘాలు, శ్రీవారి అభిమానులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com