AP : పోసాని, శ్రీరెడ్డిలపై కొత్త కేసులు నమోదు

AP : పోసాని, శ్రీరెడ్డిలపై కొత్త కేసులు నమోదు
X

సినీనటి, వైసీపీ సోషల్ మీడియా సపోర్టర్ శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అనితలపై అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ.. మచిలీపట్నం టీడీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ నిర్మల ఫిర్యాదు చేశారు. దీంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి.. అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, అనితలపై ఆమె ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ.. సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఇప్పటికే శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు.. వైసీపీ నేత, సినీ నట దర్శకుడు పోసాని కృష్ణమురళిపై కూడా ఏపీలోని గుంటూరు, విజయవాడలో కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story