ఏపీ ప్రజల నడ్డిని మరింత విరిచేందుకు రంగం సిద్ధం చేసిన జగన్ సర్కార్!

ఏపీ ప్రజల నడ్డిని మరింత విరిచేందుకు రంగం సిద్ధం చేసిన జగన్ సర్కార్!

ఏపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే అన్నింటి మీద పన్నులు పెంచిన ప్రభుత్వం తాజాగా పట్ణణాలు, నగరాల్లో ఆస్తి, నీరు, డ్రైనేజీ పన్నులను కూడా పెంచనుంది. ఈమేరకు ఇప్పటికే జీవోలు కూడా జారీ చేసింది. స్థానిక సంస్థలకు బలం చేకూరలన్న కేంద్రం ఆదేశాలను సాకుగా చూపి ఈ జీవోలను విడుదల చేసింది. ఈ జీవోల ప్రకారం నీటి వాడకందారులను మూడు కేటగీరులుగా విభజిస్తూ.. వాటికి నిర్ణయించాల్సిన వాటర్ ఛార్జీలకు కనిష్ట, గరిష్ట పరిమితులను నిర్దేశించింది. అయితే ఈ ఛార్జీల పెంపును ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

పట్టణాలు, నగరాల్లోని నీటి కనెక్షన్లను గృహ, వాణిజ్య, ఇన్ స్టిట్యూషన్ కేటగీరీలుగా విభజించారు. వ్యక్తిగత గృహాలకు నెలకు 100 నుంచి 350 రూపాయల మధ్య, అపార్టమెంట్లకు వెయ్యి లీటర్లకు 30 నుంచి 50, కమర్షియల్ కనెక్షన్లకు వెయ్యి లీటర్లకు 60 నుంచి 140, ఇన్ స్టిట్యూషన్లకు వెయ్యి లీటర్లకు 40 నుంచి 80 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు.

రుసుముల నిర్థారణ కోసం డ్రైనేజీ కనెక్షన్లను మూడు రకాలు విభజించారు. అలాగే ఆస్తి పన్నును ఇప్పటివరకు అద్దెల ప్రాతిపదికన నిర్ణయించేవారు. ఇప్పుడు ఆస్తి విలువ ప్రాతిపదికన పన్ను వేయాలని జీవో ఇచ్చారు. అంటే ఈ జీవో ప్రకారం మొన్నటి దాకా వెయ్యి రూపాయల పన్ను కట్టేవారు ఇకపై పదివేలు కట్టాలి. ఇక ఏడాదికోసారి ఆస్తి విలువ పెరిగితే పన్నుల భారం కూడా పెరుగుతూనే ఉంటుంది. దీంతో ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. పట్ణణాల్లో సామాన్య ప్రజలు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మొత్తానికి ఏపీ ప్రజల నడ్డిని మరింత విరించేందుకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ పన్నుల భారం మోపనుంది.


Tags

Read MoreRead Less
Next Story