Chandrababu Naidu :తప్పు చేస్తే ఎవరినీ వదిలి లేదు.. దటీజ్ చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు గతంలో కంటే పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా అస్సలు వదలట్లేదు. నా పరా అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన ఒక ప్రకటన చేశారు. తప్పు ఎవరు చేసినా వదిలేది లేదని తేల్చి చెప్పేశారు. అందుకు తగ్గట్టే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ మధ్య సత్యవేడు ఎమ్మెల్యే ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడాడని సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు. ఇప్పుడు నకిలీ మద్యం విషయంలోనూ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ నకిలీ మద్యం విషయంపై ఎన్నో పోరాటాలు చేసింది. దీని కారణంగా వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు అని సీఎం చంద్రబాబు అప్పట్లో స్వయంగా బయటపెట్టారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై విచారణకు కూడా ఆదేశించారు. విచారణలో టిడిపి నేతలు ఉన్నారని తేలడంతో ఏమాత్రం ఆలోచించకుండా చర్యలకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్ల పల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం తయారీలో తంబళ్ల పల్లి టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి అతని అనుచరుడు కట్టా సురేంద్ర నాయుడు ఉన్నారని తేలడంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జయచంద్రా రెడ్డి 2024 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేశారు. వైసిపి హయాంలో జరిగిన నకిలీ మద్యం దందా ఎంతమంది ప్రాణాలను గాల్లో కలిపేసిందో అందరికీ తెలిసిందే. ప్రజలకు చెడు చేసే ఇలాంటి విషయాల్లో సొంత పార్టీ నేతలు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు అస్సలు ఉపేక్షించట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి మాత్రం 2019 నుంచి 2024 వరకు ఈ నకిలీ మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నా సరే వారిపై ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. పైగా వారిది ఎలాంటి తప్పు లేదన్నట్టు వారేదో సమాజ సేవ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు.
ఈ విషయంలోనే చంద్రబాబు నాయుడుకు జగన్ కి ఉన్న తేడా ఏంటో అర్థం అవుతుంది. సొంత పార్టీ నేతలు తప్పు చేస్తే ప్రతిపక్షాల కంటే ముందే చంద్రబాబు నాయుడు స్పందిస్తున్నారు. వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. ప్రభుత్వ పరంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ వైసీపీ పార్టీ నేతలు ఎన్ని తప్పులు చేసినా.. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా జగన్ స్పందించిన పాపాన పోలేదు. ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి సీఎం చంద్రబాబు నాయుడు లాంటి విజినరే ఉంటుంది. ఓవైపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ.. ఇంకోవైపు అవినీతి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాటిస్తున్న ఈ సిద్ధాంతాలు వ్యవస్థను బాగుపరచడం కోసమే అని ప్రజలకు కూడా అర్థమవుతుంది. తప్పు చేస్తే నా పర అనే బేధం లేకుండా వ్యవహరిస్తేనే కదా ఆ నాయకుడిని ప్రజలు నమ్మేది. ఆ విషయంలో జగన్ పాతాళంలో ఉంటే చంద్రబాబు నాయుడు ఆకాశంలో ఉన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com