నందివాడ పీఎస్‌లోనే దేవినేని ఉమ

నందివాడ పీఎస్‌లోనే దేవినేని ఉమ
X

Devineni Uma File Photo

Devineni Uma: దేవినేని ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతల ఆందోళన

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమను నందివాడ పీఎస్‌లో నిర్బంధించడపై టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి ఉమను నందివాడ పీఎస్‌లో ఉంచారు. ఉమను కోర్టుకు హాజరుపరచడంపై మరింత జాప్యం జరిగే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. మరోవైపు దేవినేని ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నందివాడ పీఎస్‌కు భారీగా టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలపై కేసుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం కానున్నారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతల్ని వదిలిపెట్టి.. టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.

Tags

Next Story