TDP : టీడీపీ కొత్త సారథి ఎన్నికకు నోటిఫికేషన్.. నేటి సాయంత్రం ప్రకటన

TDP : టీడీపీ కొత్త సారథి ఎన్నికకు నోటిఫికేషన్.. నేటి సాయంత్రం ప్రకటన
X

కడప మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం మహానాడు వేదికపై పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్నిక నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంటుందని తెలిపారు. అలాగే బుధవారం నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందని, ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని వర్ల రామయ్య వెల్లడించారు. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఎన్నిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేవలం పార్టీ నిబంధనలు, నియమావళికి అనుగుణంగా ఈ ఎన్నికను నిర్వహిస్తున్నారు.

Tags

Next Story