NTR Trust : తిరుపతి పాతకాల్వలో నిరాశ్రయులకు ఎన్‌టీఆర్ ట్రస్ట్ సాయం..

NTR Trust (tv5news.in)
X

NTR Trust (tv5news.in)

NTR Trust : అకాల వర్షాల కారణంగా అన్ని కోల్పోయిన వరద బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ అండగా నిలుస్తోంది.

NTR Trust : అకాల వర్షాల కారణంగా అన్ని కోల్పోయిన వరద బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ అండగా నిలుస్తోంది. ట్రస్టు ఛైర్మన్ నారా భువనేశ్వరీ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు ట్రస్టు ప్రతినిధులు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు ఆహారం, తాగు నీరు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ప్రతినిధులు. బాధితుల్లో భరోసా నింపుతున్నారు.

చిత్తూరు జిల్లాలో వరద సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వరదల కారణంగా నిరాశ్రయులుగా మారిన వారికి NTR ట్రస్టు అండగా నిలబడుతోంది. తిరుపతి రూరల్ మండలంలోని పాతకాల్వలో 3వేల మంది నిరాశ్రయులకు భోజనాన్ని పంపిణీ చేశారు NTR ట్రస్టు సభ్యులు. దాంతో పాటు పాలు, పెరుగును కూడా ఉచితంగా అందజేశారు.

Tags

Next Story