YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..

YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..
X
YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది.

YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. వివేకా కుమార్తె సునీత, వాళ్ల అనుచరులు తనను బెదిరిస్తున్నారంటూ గంగాధర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్పకి ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో తాను సుపారీ తీసుకున్నట్టు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని అతనంటున్నాడు.

గతంలో సిట్ బృందంలో సభ్యుడైన మడకసిర సీఐ శ్రీరామ్‌తోపాటు, సీబీఐ అధికారులు కూడా తనను బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. గంగాధర్‌రెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్టు జిల్లా అనంతపురం జిల్లా ఎస్పీ వివరించారు. అతను చెప్తున్న రెండు వాట్సప్ స్క్రీన్‌ షాట్లలో ఏముంది అనేదానిపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags

Next Story