నెల్లూరు కలెక్టరేట్‌లో పనబాక లక్ష్మి నామినేషన్‌..!

నెల్లూరు కలెక్టరేట్‌లో పనబాక లక్ష్మి నామినేషన్‌..!
తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లో, టీడీపీ నేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.

తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లో, టీడీపీ నేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి, యనమల రామకృష్ణుడు, దేవినేని, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్, జిల్లా టీడీపీ నేతలు పనబాక లక్ష్మి వెంట నడిచారు.

నామినేషన్‌కు ముందు భారీ ర్యాలీ చేపట్టారు టీడీపీ నేతలు. వీఆర్సీ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పనబాక లక్ష్మి. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ.. ఆ హామీని విస్మరించారన్నారు. ప్రజలు 22 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే.. పార్లమెంట్‌లో కనీసం నోరు మెదపడం లేదని పనబాక విమర్శించారు.

పనబాక లక్ష్మి నామినేషన్‌కు వేలాది మంది వచ్చారంటే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అదే నిదర్శనం అని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాయలసీమలో ఈ రెండేళ్లలో ప్రాజెక్టులుగాని, నిరుద్యోగులకు ఉద్యోగాలు గానీ వచ్చాయా అని ప్రశ్నించారు. జగన్‌ కేసుల మాఫీకే వైసీపీ ఎంపీలు పోరాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. 22 మంది ఎంపీలు గొర్రెల మందల్లా ఉన్నారే తప్ప.. రాష్ట్రం కోసం ఒక్క పోరాటం చేయడం లేదని విమర్శించారు.

జగన్‌ ఓ దద్దమ్మ కాబట్టే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపలేని అసమర్ధుడిగా నిలబడిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండేళ్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. సొంతంగా మద్యం షాపులు పెట్టి రోజుకు 300 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story