ట్విట్టర్‌లో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పంచుమర్తి అనురాధ ఫైర్

ట్విట్టర్‌లో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పంచుమర్తి అనురాధ ఫైర్
X
మంగళగిరి ప్రజలు కరకట్ట కమల్‌రెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు అనురాధ.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్విట్టర్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటేసిన ప్రజలను గాలికొదిలేసి కేసులతో కరకట్ట కమల్‌రెడ్డి కాలక్షేపం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణరెడ్డిపై ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

మంగళగిరి ప్రజలు కరకట్ట కమల్‌రెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. పొలం గట్ల మీద పాములు పట్టుకొని వేసే డ్రామాలు కోర్టులో వేస్తే ఎలా అని ప్రశ్నించారు.

సదావర్తి భూముల విషయంలో కోర్టు చివాట్లు పెట్టిందని గుర్తు చేసిన అనురాధ.. ఇపుడు ఏకంగా ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టి దేశవ్యాప్తంగా నవ్వుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కరకట్ట వేశాలు, ఫొటో షూట్లు, ఫేక్ కేసులు మానుకుని ఓటేసిన ప్రజల గురించి ఆలోచించాలని హితువు పలికారు.





Tags

Next Story