Pawan Kalyan : వైసీపీ కార్పొరేటర్లకు పవన్ బంపరాఫర్
వైసీపీపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదని, ఎవరూ తనకు శత్రువు కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఆ పార్టీ గుడ్ బై చెప్పి జనసేనలో చేరడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. స్వయంగా వారికి కండువా కప్పి జనసేనలో ఆహ్వానించారు.
తనకు ఎంతో ఇష్టమైన విశాఖలో చేరికలు మొదలవ్వడం ఆనందంగా ఉందన్నారు పవన్. "వైసీపీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. రాష్ట్ర అభివృద్ది, ప్రజల
సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. జనసేన పార్టీలో చేరిన వారందరికీ తరఫున ధన్యవాదాలు. మీ సేవలను పార్టీ గుర్తిస్తుంది. అందరం కలిసి పని చేద్దాం.. ప్రజలకు సేవ చేద్దాం. భవిష్యత్ లో విశాఖపట్టణం కార్పొరేషన్ లో కూటమి విజయకేతనం ఎగుర వేయాలి. వారికే టికెట్ ఇస్తాం." అని పవన్ కల్యాణ్ చెప్పారు. విశాఖలో పర్యావరణ ఆడిట్ ఉంటుందని, విశాఖ రియల్ ఎస్టేట్ సమస్యలపై కలిసిగట్టుగా పోరాటం చేస్తామని పవన్ చెప్పారు.
త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com