Pawan Kalyan : నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవిపై పవన్ క్లారిటీ

Pawan Kalyan : నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవిపై పవన్ క్లారిటీ
X

నామినేటెడ్ పోస్టుల విషయంలో పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) కీలక కామెంట్లు చేశారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు.. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరన్నారు. నా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు….కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారనీ.. అది కరెక్ట్ కాదని అన్నారు. ఈ సందర్భంగా జనసేన ప్రజా ప్రతినిధులకు సత్కారం చేశారు.

పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సత్కార కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అనంతరం మాట్లాడారు. కష్టపడిన వారిని మరిచిపోబోమని తెలిపారు. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందని… నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమని చెప్పారు.

మన పార్టీ అయినా సరే… రౌడీయిజంతో భయపెట్టాలని చూస్తే పార్టీ నుండి బయటకే అని హెచ్చరించారు పవర్ స్టార్.

Tags

Next Story