AP: ఒకేరోజున 13,326 గ్రామాల్లో గ్రామసభలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకేరోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకే రోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వేకోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు.
23న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరి వారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మోడల్ పంచాయతిగా మైసూరివారిపల్లె నిలిచింది. డిప్యూటి సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా.. గ్రామసభపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల్లో పనిచేయడమంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని తాను నమ్ముతున్నట్లు పవన్ తెలిపారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తామని పవన్ తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు, అధికారులు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు.
ప్రజలందరూ అధిక సంఖ్యలో గ్రామ సభలో పాల్గొనేలా చూడాలని... గ్రామసభలు అర్థవంతంగా జరగాలంటే గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ సభల్లో మనస్పూర్తిగా పాల్గొనాలి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే అందరూ ఉద్యోగులు గ్రామ సభల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి సభలు విజయవంతానికి కృషి చేయాలి’’ అని పవన్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com